ప్రత్యేక హోదా ఇవ్వలేమని తేల్చి చెప్పేసిన అరుణ్ జైట్లీ

ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేక హోదా అంశం పెను దుమారాన్ని రేపుతోంది. ఈ నేపథ్యంలో గతంలో ప్రత్యేక హోదా ఏమైనా సంజీవని అన్న చంద్రబాబునాయుడు కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని అనడం విశేషం. విభజన నేపథ్యంలో విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన ప్రధాన హామీలలో ప్రత్యేక హోదా చాలా ప్రాముఖ్యమైనది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే అభివృద్ధి జరుగుతుంది అని రాష్ట్ర ప్రజలందరికీ అర్థమయింది.
ఈ నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాదు కదా ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేమని తేల్చిచెప్పేసింది ఈ క్రమంలో తాజాగా కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి  జైట్లీ మీడియాతో మాట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వ‌లేమ‌ని స్ప‌ష్టం చేశారు. GST రాబడి కేంద్ర, రాష్ట్రాలకు పంపిణీ జరుగుతుందని అన్నారు. తగినంత రాబడి లేకపోవడం వల్లే ఆశాన్య రాష్ట్రాలకు గతంలో ప్రత్యేక హోదా ఇచ్చారని తెలిపారు. ఈశాన్య రాష్ట్రాలకు 90:10 నిష్పత్తిలో నిధుల పంపిణీ జరుగుతోందని వివరించారు.
ఏపీకికూడా ప్ర‌త్యేక ప‌రిస్థితుల్లో 90:10 నిస్ప‌త్తిలో నిధులు అందించేందుకు మార్గాల‌ను అన్వేషిస్తున్నామ‌న్నారు.కొన్ని పరిణామాల వల్ల ప్రత్యేక హోదా అనే విధానమే మనుగడలో లేకుండా పోయిందని జైట్లీ చెప్పారు. తాజాగా రెండే క్లీన్ ప్రకటనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీ నాయకులతో పాటు ఆంధ్ర ప్రజలు కూడా తీవ్ర అసహనం చెందుతున్నారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీ అమలు కాకపోతే ఇంకా చట్టసభలు దేనికి అని ప్రశ్నిస్తున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here