నన్ను వాడుకుని వదిలేశారు: పవన్ కళ్యాణ్

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాజాగా సంచలనమైన వ్యాఖ్యలు చేశారు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల పట్ల. గత ఎన్నికలలో టిడిపి బిజెపి కూటమికి మద్దతు తెలిపి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైన పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెను దుమారాన్ని రేపుతున్నాయి.అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ,బీజేపీ పార్టీలు గెలిస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ,విశాఖకు రైల్వే జోన్ ,కడపకు ఉక్కు పరిశ్రమ లాంటి హామీలను నెరవేరుస్తుంది.
దానికి నేను బాధ్యత తీసుకుంటా అని పవన్ కళ్యాణ్ అప్పట్లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఐదున్నర కోట్ల ఏపీ ప్రజలకు హమీచ్చారు.అయితే తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ఎన్నికల్లో నేను ఎవర్ని నమ్మి వారికి మద్దతు ఇచ్చానో వారు ప్రస్తుతం నన్ను వాడుకొని వదిలేశారు.రాష్ట్రానికి న్యాయబద్ధంగా రావాల్సిన నిధులు ,హామీలు నెరవేర్చకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆంధ్రులను మోసం చేశాయి. ఈ నేపధ్యంలో తదుపరి భవిష్యత్ కార్యాచరణ గుంటూరులో జనసేన పార్టీ నిర్వహించే మహాసభను వెల్లడి చేస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు. అంతే కాకుండా ప్రత్యేక హోదా గురించి ఒక కీలకమైన ప్రకటన పవన్ కళ్యాణ్ చేస్తారని అంటున్నారు జనసేన పార్టీ వర్గాలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here