శ్రీదేవి బయోపిక్ ప్లాన్ చేస్తున్న బోనీకపూర్

అతిలోక సుందరి శ్రీదేవి మరణం తన కుటుంబంతో పాటు తన అభిమానులను ఎంతగానో బాధించింది. శ్రీదేవి బయోపిక్ సినిమా వస్తున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాను గతంలో రామ్ గోపాల్ వర్మ తీస్తున్నాడని అప్పట్లో వార్తలు రావడం జరిగాయి అయితే ఈ క్రమంలో రాంగోపాల్ వర్మ ఊహించని రీతిలో సమాధానం ఇచ్చారు.శ్రీ‌దేవి లాంటి ఇంకో న‌టి పుట్ట‌లేదు.. నేను తీయ‌ను! అనేశారు. అయితే ఈ క్రమంలో భర్త బోనీకపూర్ శ్రీదేవి బయోపిక్ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని అన్నుకుంటున్నాడు.
ఈ విషయాన్ని శ్రీ దేవి భర్త బోనీకపూర్ తన సన్నిహితుల దగ్గర వెల్లడించినట్లు తెలుస్తోంది. శ్రీ‌దేవి మ‌ర‌ణానంత‌రం త‌న‌ని మీడియా వాళ్లు ప్రొజెక్ట్ చేసిన తీరుపైనా క‌న్నీటిప‌ర్యంతం అయ్యార‌ట‌. అందుకే అస‌లేం జ‌రిగింది? అన్న‌దానిపైనా ఓ వివ‌ర‌ణ ఇస్తూ బ‌యోపిక్‌ని తీయాల‌ని భావిస్తున్నాడుట‌. త‌న భార్య‌ శ్రీ‌దేవి లైఫ్ లో ఎవ‌రికీ తెలియ‌ని విష‌యాల్ని, భార్య‌తో అనుబంధాన్ని రేర్‌ ఫుటేజీ, వాయిస్‌ల‌తో వ‌న్‌స్టాప్ ఫిలిం వండ‌ర్‌గా తీయాల‌ని బోనీ సీరియ‌స్‌గా ఆలోచిస్తున్నాడ‌ట‌. ఈ సినిమాకి డైరెక్టర్ గా బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్ డైరెక్ న్ లో తీయాలని చూస్తున్నాడు. ప్రస్తుతం బోనీకపూర్ శ్రీదేవి మరణం షాకింగ్ లోనే ఉన్నారు…ఇప్పుడిప్పుడే బయట ప్రపంచానికి అలవాటుపడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here