ఆ విషయంలో నిజం లేదు ఎన్టీఆర్ బయోపిక్ గురించి చెప్పిన డైరెక్టర్ తేజ

ఎన్టీ రామారావు జీవిత చరిత్రను ప్రముఖ దర్శకుడు తేజ ఎన్టీఆర్ బయోపిక్ గా తెరకెక్కిస్తున్నాడని మనకందరికీ తెలుసు. ఈ సినిమాలో ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ సీనియర్ ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఈ క్రమంలో ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలో ఎన్టీఆర్ వయసులో ఉన్నప్పటి పాత్రను యువ నటుడు శర్వానంద్ నటిస్తాడని తెగ ప్రచారం జరుగుతుంది. ఈ విషయం పై స్పందించిన తేజ .. ఈ సినిమాలో యంగ్ ఎన్టీఆర్ గా శర్వానంద్ నటిస్తున్నట్టు వస్తున్నా వార్తల్లో ఎలాంటి నిజం లేదు అని చెప్పేసాడు.
ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నెలాఖరు నుండి ఈ సినిమా పూజా కార్యక్రమాలు మొదలవుతున్న ట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి నటీనటుల ఎంపిక విషయాన్ని బాలకృష్ణ దగ్గరుండి చూసుకుంటున్నాడు. నందమూరి బాలకృష్ణ సినీ జీవితంలోనే ఈ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం. వచ్చే ఎన్నికలకు ముందే ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాడు బాలకృష్ణ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here