త్వరలో వెండి తెరపై ఆవిష్కృతమవుతున్న షకీలా బయోపిక్

ఒకప్పటి శృంగార కథానాయిక దక్షిణాది చలనచిత్ర రంగాలలో మంచి క్రేజ్ వున్న హీరోయిన్ షకీలా జీవిత చరిత్రను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదివరకు రోజులలో షకీలా సినిమా అంటే అప్పట్లో ఉన్న కుర్రకారు సొల్లు కార్చుకుంటూ లైన్లో నిలబడే వాళ్లు….ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా వచ్చినా కానీ ముందు షకీలా సినిమాకే వెళ్లేవారు అప్పటి కుర్రకారు. స్టార్ హీరోల సినిమాలకు చాలా పోటీ ఇచ్చేది షకీలా. ఈ క్రమంలో షకీలా బయోపిక్ సినిమాను బాలీవుడ్ నటి రిచా చద్దాతో తీస్తున్న ఈ సినిమాకు ఇంద్రజిత్ లంకేశ్ దర్శకత్వం వహించనున్నారు.
ఇందులో షకీలా 16 ఏళ్ల ప్రాయంలో సినీరంగ ప్రవేశం చేయడం, ఆ తర్వాత ఈ రంగుల ప్రపంచంలో ఆమె సాగించిన సుదీర్ఘ ప్రయాణం, ఆమె ఎదుర్కొన్న కష్టనష్టాలను సెల్యూలాయిడ్‌పై కళ్లకుకట్టినట్టుగా ఆవిష్కరించనున్నారని సమాచారం. ఈ ఏప్రిల్‌‍లో సినిమా షూటింగ్ మొదలుపెట్టి వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. గతంలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ సిల్క్ స్మిత చిత్రాన్ని డర్టీ పిక్చర్ గా తెరకెక్కించడం జరిగింది ఈ సినిమా భయంకరంగా బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించింది. ఈ నేపథ్యంలో షకీలా సినిమా కూడా హిట్ అవుతుంది అని అంటున్నారు సినిమా విశ్లేషకులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here