సాయి పల్లవి హాజరవడం వల్ల రాలేకపోయినా నాగ శౌర్య

ప్రముఖ హీరోయిన్ సాయి పల్లవి పై హీరో నాగ శౌర్య ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కామెంట్స్ చేయడం జరిగింది. సాయి పల్లవి ప్రవర్తన వల్ల చాలా ఇబ్బంది పడ్డాను అని నాగశౌర్య సంచలన కామెంట్స్  చేశారు…. వీరిద్దరూ కలిసి తమిళ్ రీమేక్ సినిమా ‘కణం’లో నటించడం జరిగింది. విశేషం. ఈ సినిమా షూటింగ్ సమయంలో నాగశౌర్య .. సాయిపల్లవి మధ్య మనస్పర్థలు వచ్చాయనే టాక్ వచ్చింది. సాయిపల్లవి ధోరణి తనని చాలా ఇబ్బంది పెట్టిందని నాగశౌర్య బయటికి చెప్పేశాడు.

తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను జరుపుకుంది. ఈ ఫంక్షన్ కి నాగశౌర్య హాజరుకాకపోవడం విశేషం. ఈ సందర్భంగా హీరోయిన్ సాయి పల్లవి మాట్లాడుతూ అలా అసహనాన్ని వ్యక్తం చేయడం ఆయన వ్యక్తిగతం అంటూ సమాధానమిచ్చింది. ఈ కార్యక్రమానికి వస్తే ఎక్కడ సాయి పల్లవి మొహం చూడాల్సి వస్తుందో అని నాగ శౌర్య రాకుండా ఎగ్గాగోట్టిన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ క్రమంలో కొంతమంది ఇండస్ట్రీలో ఉన్నవారు కెరీర్ లో  ఎదుగుతున్న కుర్ర హీరో కి ఇంత ఈగో ఉండకూడదు అని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here