ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలో శర్వానంద్

నందమూరి బాలకృష్ణ తన తండ్రి ఎన్టీ రామారావు జీవిత చరిత్రను ఎన్టీఆర్ బయోపిక్ సినిమాను తీస్తున్నాడు. బాలకృష్ణ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్ర పోషిస్తున్నాడు ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ముగిశాయి. కానీ కొన్ని ముఖ్య పాత్రలకు సంబందించిన నటి నటులను మాత్రం ఇంకా ఫైనల్ చేయలేదు. అయితే తాజాగా ఈ సినిమాలో యువ ఎన్టీఆర్ కోసం ఇప్పుడు దర్శకనిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు.
కుర్ర హీరోల వైపు బాలయ్య చూపు వెళుతుందని సమాచారం. ఆ లిస్ట్ లో యువ హీరో శర్వానంద్ ఉన్నారని ప్రస్తుతం టాలీవుడ్ లో టాక్ వస్తోంది. శర్వానంద్ కెరీర్ ప్రస్తుతం మంచి హిట్ ట్రాక్ లో ఉంది. దర్శకుడు తేజ కూడా శర్వా అయితే కరెక్ట్ గా సెట్ అవుతాడని చెబుతున్నాడట. రాబోయేది ఎన్నికల సంవత్సరం కనుక ఎన్నికల ముందు ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాడు బాలకృష్ణ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here