బిజెపి పార్టీ లోకి వెళుతున్న ఉపేంద్ర

సౌత్ సిని ఇండస్ట్రీ కి చెందిన చాలామంది స్టార్ హీరోలు రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు. ఈ విషయంలో తమిళనాడు రాష్ట్ర రాజకీయాలలో రజనీకాంత్ కమలహాసన్ అడుగుపెట్టి ముందున్నారు. వీరిద్దరి రాకతో తమిళనాడు రాష్ట్ర రాజకీయాలలో అనేక సంచలనాలు సమీకరణలు మారుతున్నాయి తమిళ రాజకీయాల్లో. అలాగే వీరి లాగా త్వరలో కర్ణాటక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర పార్టీ పెట్టడం జరిగింది.
ఈ నేపథ్యంలో సొంత పార్టీ నాయకులే తిట్టుకోవడంతో ఉపేంద్ర పార్టీ మారాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉపేంద్ర స్థాపించిన పార్టీలో అంతర్గత విమర్శలతో రగిలిపోతుంది. దీంతో ఇప్పుడు ఉపేంద్ర భారత జనతా పార్టీలో చేరుతున్నారని వార్తలు వస్తున్నాయి. గత ఏడాది సొంతంగా పార్టీని స్థాపించిన ఉపేంద్ర ఇప్పటి వరకు పెద్దగా సభలని కార్యక్రమాలను నిర్వహించలేదు.
ప్రజల్లోకి కూడా వెళ్లలేదు. దీంతో ఆ పార్టీ ఉపాధ్యక్షుడు శివ కుమార్ రీసెంట్ గా మీడియా ముందుకు వచ్చినా ఉపేంద్రపై అసహనం వ్యక్తం చేశాడు. ఈ పరిణామాలతో ఉపేంద్ర బిజెపి పార్టీ లోకి వెళ్లాలనుకుంటున్నారు. ఇంకా ఎన్నికలకు రెండు నెలల సమయముంది ఏమవుతుందో చూడాలి మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here