2019 ప్రీ పోల్ ఎన్నికల సర్వే ఫలితాలు

వచ్చే సంవత్సరం ఎన్నికల నామ సంవత్సరం కనుక ప్రీ పోల్ స‌ర్వే నిర్వహించడం జరిగింది, ఈ సర్వేలో ముఖ్యంగా రాష్ట్రంలో చాలా పార్టీలు ఉన్న పోటీ మాత్రం తెలుగుదేశం పార్టీకి వైసీపీ పార్టీకి మధ్య ఉంది. గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ పవన్ కళ్యాణ్ మద్దతు తో అధికారంలోకి రావడం జరిగింది. అయితే ఈ క్రమంలో తాజాగా జరిగిన ప్రీ పోల్ స‌ర్వేలో తెలుగుదేశం పార్టీ రాబోయే ఎన్నికలలో ఓడిపోయేట్టు ఉంది. తాజాగా ప్రీ పోల్ స‌ర్వేలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు న‌ల్లేరుమీద న‌డ‌కేన‌ని తేల్చి చెప్పింది.
అధికార పార్టీ టీడీపీ ప్ర‌జ‌ల వ్య‌తిరేక‌త‌తో ద్వితీయ స్థానంతో స‌రిపెట్టుకుంది. 2014 ఎన్నిక‌ల్లో అమ‌లుకాని, మోస‌పూరిత హామీలు ఇచ్చి గ‌ద్దెనెక్కిన చంద్ర‌బాబు.. త‌న‌మీద ఉన్న కేసుల‌కు భ‌య‌ప‌డి కేంద్రంతో క‌లిసి ప్ర‌త్యేక హోదా బ‌దులు ప్ర‌త్యేక ప్యాకేజీకి ఒప్పుకున్న నేప‌థ్యంలో టీడీపీ ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌లు తీవ్ర వ్య‌తిరేక‌త చూపుతున్నారు. మరోపక్క రాష్ట్రాన్ని విభజించినా కాంగ్రెస్ పార్టీ ని చీ కొడుతున్నారు….అలాగే అప్పుడప్పుడు కేవలం తెలుగుదేశం పార్టీ కాపాడడం కోసం అన్నట్టుగా వ్యవహారిస్తున్న జనసేన పార్టీ ని కూడా జనాలు పక్కన పెట్టినట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో  సర్వే ఫలితాలు రాష్ట్రంలో మొత్తం శాసనసభ స్థానాలు 175 ఉంటె వాటిలో టిడిపికి 51 జనసేన 19 వైసీపీకి 105.ఈ ప్రీ పోల్ సర్వే ఫలితాలతో వైసీపీ నాయకత్వం తెగ సంతోషపడుతుంది. మొత్తంమీద జగన్ చేస్తున్న ప్రజా సంకల్ప పాదయాత్ర రాష్ట్ర రాజకీయాలలో సంచలనం సృష్టించింది అని చెప్పవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here