ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా అవసరం: రాహుల్ గాంధీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టి ఢిల్లీలో నిర్వహించిన చేపట్టిన ‘ఆంధ్రుల ఆత్మగౌరవ దీక్ష’లో  రాహుల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా అవసరమని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధన అంశంలో ఆంధ్రులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా కేంద్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని, తొలి సంతకం హోదాపైనే ఉంటుందని కూడా ప్రకటించారు. అంతే కాకుండా ప్రత్యేక హోదా ఇవ్వడానికి సంకోచిస్తున్న బిజెపిపై పోరాడాలని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ. రాహుల్‌ గాంధీ ఒక్క నిమిషంలోనే ప్రసంగం ముగించి వేదికపై దిగి వెళ్ళిపోవడంతో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ సభలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here