స్పెష‌ల్ పోలీస్ ఆఫీస‌ర్ అరెస్ట్‌.. ఎందుకంటే..

జ‌మ్ము క‌శ్మీర్ పోలీసులు ఓ స్పెష‌ల్ పోలీస్ ఆఫీస‌ర్‌ను అరెస్టు చేశార‌న్న వార్త ఇప్పుడు హ‌ల్ చ‌ల్ చేస్తోంది. అయితే ఆయ‌న స్పెష‌ల్ పోలీస్ ఆఫీస‌ర్ కాదు.. పోలీస్ ఆఫీస‌ర్ నుంచి ఉగ్ర‌వాదిలా మారిన వ్య‌క్తి. ఈ విష‌యాన్ని జ‌మ్ముక‌శ్మీర్ పోలీసులు ఓ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించారు.

స్పెష‌ల్ పోలీస్ ఆఫీస‌ర్ అల్తాఫ్ హుసేన్ ఉగ్ర‌వాదుల‌తో క‌లిసి ఉండ‌గా పోలీసులు అరెస్టు చేశారు. ఈయ‌న అక్టోబ‌ర్ 24న అదృశ్య‌మయ్యారు. ఇత‌ను ఉగ్ర‌వాదుల‌తో క‌లిసి ఉన్నాడ‌న్న సమాచారం రావ‌డంతో పొలీసులు రంగంలోకి దిగారు. ఈ సమయంలో ఓ వాహనంలోని వ్యక్తులు తమ వాహనంతో అకస్మాత్తుగా దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దానిని అత్యంత చాకచక్యంగా పోలీసులు ఆపగలిగారు. ఆ వాహనంలోని వ్యక్తులు పోలీసులపై దాడి చేసి, తప్పించుకునేందుకు ప్రయత్నించారు.

వారిని భద్రతా దళాలు అదుపు చేయగలిగాయి. వీరిలో ఒకరు ఎస్‌పీఓ అల్తాఫ్ హుస్సేన్ అని గుర్తించారు. మిగిలిన ముగ్గురు – షబీర్ అహ్మద్ భట్, జంషీద్ మాగ్రే, జహీద్ దార్ – ఉగ్రవాదులని గుర్తించారు. వీరంతా పుల్వామాకు చెందినవారు. వీరిని అరెస్టు చేసి, ఆయుధాలు, మందుగుండు, ఇతర నేరపూరిత వస్తువులు, పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఉగ్రవాదులుగా మారార‌న్న వార్త బ‌య‌ట‌కు రాగానే అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఇలాంటి వారికి క‌ఠిన శిక్ష విధించాల‌ని కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here