ర‌జినీకాంత్ ఇప్ప‌టి నుంచి ఏం చేయాలో చెప్పిన డాక్ట‌ర్లు..

సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్‌ను అనారోగ్య స‌మ‌స్య‌లు ఇబ్బంది పెడుతున్నాయి. సినిమాలు తీసుకుంటున్న ర‌జినీకాంత్ రాజ‌కీయాల్లోకి రావాల‌ని ఆయన అభిమానులు కోరుతున్నారు. అయితే అందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్న ర‌జినీకాంత్‌కు ఉన్న‌ట్టుంటి అనారోగ్య స‌మ‌స్య‌లు ఎదుర‌వ్వ‌డం ఆందోళ‌న క‌లిగించే అంశం.

ర‌జినీకాంత్ హైద‌రాబాద్‌లో అన్నాతే మూవీ షూటింగ్ బిజీగా ఉన్న స‌మ‌యంలో సెట్లో కొంద‌రికి క‌రోనా సోకింది. దీంతో ద‌ర్శ‌కుడు సినిమా షూటింగ్‌ను ఆపేశాడు. అయితే ముందు జాగ్ర‌త్త‌గా ర‌జినీ కూడా క‌రోనా టెస్టులు చేయించుకోగా ఆయ‌న‌కు నెగిటివ్ వ‌చ్చింది. అయినా ఆయ‌న జాగ్ర‌త్త‌లు తీసుకుంటూనే ఉన్నారు. అయితే ఉన్న‌ట్టుండి బీపీ అప్ అండ్ డౌన్ అవ్వ‌డంతో అపోలో హాస్పిట‌ల్లో చేరారు. రెండు రోజుల నుంచి ఆయ‌న ఆరోగ్యం బాగానే ఉంద‌ని వైద్యులు చెబుతున్నా డిశ్చార్జ్ చేయ‌క‌పోవ‌డంతో ఒకింత ఆందోళ‌న నెల‌కొంది.

ర‌జినీకాంత్‌ను ఇప్పుడు డాక్ట‌ర్లు డిశ్జార్జు చేశారు. అయితే డాక్ట‌ర్లు ప‌లు కీల‌క సూచ‌న‌లు చేశారు. వారం రోజుల పాటు ఆయ‌న విశ్రాంతి తీసుకోవాల‌ని సూచించారు. ప్ర‌ధానంగా క‌రోనా సోకే పరిస్థితులు ఉన్న కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉండాల‌ని చెప్పారు. ఒత్తిడిని త‌గ్గించుకునేందుకు ప‌లు వ్యాయామాలు చేయాల‌ని వైద్యులు అన్నారు. ఈ ప‌రిస్థితుల్లో ఆయ‌న ఇప్పుడు చెన్నై వెళ్తార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే ర‌జినీ రాజ‌కీయ పార్టీకి సంబంధించిన ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ నెల 31వ తేదీన ఆయ‌న కీల‌క స‌మావేశం ఏర్పాటు చేస్తార‌ని అంతా అనుకున్నారు. అయితే అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా ఏం జ‌రుగుతుందో వేచి చూడాలి. ర‌జినీ పార్టీకి సంబంధించిన స‌మావేశాల్లో పాల్గొంటారా లేదా అన్న‌ది తెలియాల్సి ఉంది. ఆయ‌న ఏం చేయ‌నున్నార‌న్న దానిపై అభిమానులు ఎంతో ఆశ‌గా ఎదురుచూస్తున్నారు. అయితే ర‌జినీకాంత్ ఆరోగ్యం బాగా చూసుకోవాల‌ని అభిమానులు కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here