అత్యంత విషమంగా బాలు ఆరోగ్యం..

ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిపై కీల‌క ప్ర‌క‌టన వెలువ‌డింది. ఆయ‌న ఆరోగ్యం క్షీణించింద‌ని తెలుస్తోంది. కరోనా సోకడంతో చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో ఆయ‌న‌ 40 రోజులుగా చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవల కరోనా నుంచి ఆయన కోలుకున్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. దీంతో ఆయ‌న అభిమానులంతా సంతోషించారు.

ఆయన కుమారుడు కూడా బాలు ఆరోగ్యం బాగానే ఉంద‌ని చెప్పారు. అయితే ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్యంపై ఆందోళ‌న‌క‌ర‌మైన ప్ర‌క‌ట‌న‌లు వ‌స్తున్నాయి. దీంతో ఏం జ‌రిగిందో అన్న ఆందోళ‌న నెల‌కొంది. దీనిపై ఆస్ప‌త్రి వ‌ర్గాలు స్పందిస్తూ 24 గంట‌లుగా ఆయ‌న ఆరోగ్యం క్షీణించింద‌న్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న వైద్యుల ప‌ర్యవేక్ష‌ణ‌లోనే ఉన్న‌ట్లు తెలిపారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్యం అత్యంత విష‌మంగానే ఉంద‌ని తెలిపారు. క‌రోనా నుంచి కోలుకున్న త‌ర్వాత ఆయ‌న ఆరోగ్యం తిర‌గ‌బెట్టింద‌న్నారు.

ఈ వార్త తెలియ‌గానే ఆయ‌న అభిమానులు, సంగీత ప్రియులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. బాల‌‌సుబ్ర‌హ్మ‌ణ్యం కోలుకోవాల‌ని దేశ వ్యాప్తంగా ఎంతో మంది ప్ర‌ముఖులు కోర‌కున్న విష‌యంతెలిసిందే. అయితే ఆయ‌న ఆరోగ్యం క్షీణించింద‌ని స‌మాచారంతో వీరందరిలో ఆందోళ‌న మొద‌లైంది. ఆయ‌న క్షేమంగా కోలుకోవాల‌ని కోర‌కుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here