కబీర్ సింగ్ ఎఫెక్ట్…  భారీగా రెమ్యూనరేషన్ పెంచిన షాహిద్.!

తెలుగులో సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి చిత్రాన్ని హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసిన విషయం తెలిసిందే. హిందీలో కూడా ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. దీంతో ఈ చిత్ర హీరో షాహిద్ కపూర్ స్టార్ డమ్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. కబీర్ సింగ్ సినిమా తర్వాత షాహిద్ తన పారితోషకాన్ని భారీగా పెంచేశాడని బాలీవుడ్ కోడై కూస్తోంది. ఈ క్రమంలోనే షాహిద్ తన తర్వాతి చిత్రానికి భారీ పారితోషకాన్ని తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

షాహిద్ కపూర్ కపూర్ ప్రస్తుతం జెర్సీ హిందీ రీమేక్ లో  నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు షాహిద్ ఏకంగా రూ. 35 కోట్ల రెమ్యునరేషన్ ను డిమాండ్ చేసినట్లు సమాచారం. దీంతోపాటు సినిమాకు వచ్చే లాభాల్లో  కొంత వాటాను కూడా అడిగాడట. ఈ లెక్కన చూసుకుంటే ఈ చిత్రం యావరేజ్ విజయాన్ని సొంతం చేసుకున్నా..  షాహిద్ తక్కువలో తక్కువగా రూ. 50 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోనున్నాడన్నమాట. మరి జెర్సీ రీమేక్ తో షాహిద్ కపూర్ స్థాయి ఏ రేంజ్ కి వెళుతుందో చూడాలి. తెలుగులో సూపర్ హిట్ విజయాన్ని అందుకున్న జెర్సీ చిత్రానికి దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి హిందీలో కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని అల్లు అర్జున్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తుండడం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here