నీ వక్షోజాలు నిజమైనవేనా..  వాటిని ముట్టుకోవచ్చా అన్నాడు.!

‘మీటూ’ ఉద్యమం హాలీవుడ్ నుంచి, టాలీవుడ్ వరకు ఎంత చర్చనీయాంశంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పలువురు దర్శక,  నిర్మాతలు తమ సినిమాల్లో నటించాలంటే.. కాంప్రమైజ్ కావాలని కోరినట్లు కొంతమంది హీరోయిన్లు ప్రముఖుల పేర్లు బయట పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనను లైంగికంగా వేధించాడని తెలిపి నటి పాయల్ ఘోష్ చర్చకు తెరలేపిన విషయం తెలిసిందే.

ఇక ఇదిలా ఉంటే తాజాగా మరో బాలీవుడ్ హీరోయిన్ షెర్లిన్ చోప్రా ఓ యాక్టింగ్ ఏజెన్సీ అధినేతపై సంచలన వ్యాఖ్యలు చేసింది. క్వాన్ ట్యాలెంట్ ఏజెన్సీ సహ భాగస్వామి అనిర్భన్ తన వక్షోజాల గురించి అసభ్యంగా మాట్లాడాడని షెర్లిన్ తెలిపింది.

ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షెర్లిన్ ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ సినిమా అవకాశాల కోసం నేను అనిర్భన్‌ను కలిశాను. ఆ సమయంలో అతను నన్ను పైనుంచి కింది వరకు చూశారు. దానికి నేను… ‘ ఏమైంది సార్.. నా డ్రెస్ బాలేదా’ అని అడిగాను. దానికి ఆయన సమాధానం ఇస్తూ… నీ వక్షోజాలు నిజమైనవేనా? వాటిని ముట్టుకోవచ్చా అని అడిగాడు. నేను ఆ క్షణం షాక్ కు గురయ్యను. అవి నిజమైనవైనా, కాకపోయినా అతనికేంటి సమస్య ఓ మహిళతో అలా మాట్లాడకూడదు’ అని షెర్లిన్ వాపోయింది. ఓవైపు డ్రగ్స్, మరోవైపు లైంగిక వేధింపుల ఆరోపణలతో సినిమా ఇండస్ట్రీ వైభవం మసకబారుతోందానిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here