అవన్నీ కట్టుకథలే నమ్మకండి: ఎస్పీ చరణ్ 

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి మరణవార్తతో యావత్ భారతదేశం దిగ్భ్రాంతికి గురైంది. బాలు కుటుంబ సభ్యులతో సమానంగా ఆయన అశేష అభిమానులు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. అయితే ఈ క్రమంలోనే కొంతమంది ఆకతాయిలు సోషల్ మీడియా వేదికగా పలు పుకార్లను వ్యాప్తి చేశారు. దీంతో సోషల్ మీడియాలో వస్తున్న వదంతులపై బాలసుబ్రహ్మణ్యం కుమారుడు ఎస్పీ చరణ్ తీవ్రంగా ఖండించారు.

సోమవారం సాయంత్రం ఎంజీఎం ఆస్పత్రిలో యాజమాన్యం తో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసిన చరణ్ మాట్లాడుతూ.. ‘నాన్నగారు ఆస్పత్రిలో చేరిన తర్వాత ప్రతి వారం బిల్స్‌ చెల్లిస్తూనే ఉన్నాం. చివరిగా నాన్న చనిపోయిన తర్వాత కూడా బిల్స్‌ గురించి అడిగితే.. ముందు భౌతికకాయాన్ని తీసుకెళ్లమని చెప్పి మాకు గౌరవం ఇచ్చారు.

మూడు కోట్లు ఖర్చు అయింది. వైస్‌ ప్రెసిడెంట్‌ సహకరించారు అంటూ కట్టుకథలు అల్లుతున్నారు. కోటి 85 లక్షలు కట్టాలి అని ఎందుకు సోషల్‌ మీడియాలో అనవసర ప్రచారం చేస్తున్నారు. కట్టుకథలతో మాకు ఎంజీఎం ఆస్పత్రి యాజమాన్యంతో ఉన్న రిలేషన్‌ చెడగొట్టవద్దు. మేము ఇంకా బాధలోనే ఉన్నాం. నాన్నగారి స్మారక స్థూపం నిర్మాణంపై నిర్ణయం తీసుకున్నాం. ప్రతి ఒక్కరూ నాన్నగారి సమాధి సందర్శనకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నాం. నాన్నగారే మాకు పెద్ద భారత రత్న.. ఒకవేళ ఇస్తే స్వాగతిస్తాం’ అని చెప్పుకొచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here