లక్ష్మణుడిగా సౌత్ స్టార్..? 

బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘ఆదిపురుష్’ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. ఇక రావణుడిగా బాలీవుడ్ నటుడు

సైఫ్‌ అలీఖాన్‌ లంకాధిపతి రావణుడి పాత్ర పోషించనున్నారు. ఈ సినిమాలో సీత పాత్ర కోసం ఇప్పటికే ‘మహానటి ఫేం’ కీర్తి సురేష్‌, కైరా అద్వానీ, ఊశ్వరి రూటేలా పేర్లతో పాటు అనుష్క శర్మ పేర్లు తెరపైకి వచ్చినా ఇంకా ఎవరినీ అధికారంగా ప్రకటించలేదు.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో లక్ష్మణుడి పాత్రలో ఓ యువ సౌత్‌ నటుడిని ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. లక్ష్మణుడి పాత్రకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతోన్న సినిమా కావడంతో ఈ చిత్రంలో దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన నటీనటులు ఉండేలా చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.ఇక ఈ చిత్ర గ్రాఫిక్స్‌ కోసం చిత్ర బృందం స్టార్ వార్స్, అవతార్‌ సినిమాలకు పని చేసిన వీఎఫ్‌ఎక్స్‌ సూపర్‌వైజర్లతో చర్చలు జరుపుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here