సోనూ సూద్ ఉచిత విద్యా.. వీరికి మాత్ర‌మే..

న‌టుడు సోనూసూద్ గురించి మ‌నం మాట్లాడుకోవాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే విల‌న్‌గా ప‌రిచ‌య‌మైన ఈయ‌న లాక్‌డౌన్‌లో హీరో అయిపోయిన విష‌యం తెలిసిందే. ఎక్క‌డో ఇరుక్కుపోయిన వారిని సొంతూరికి తీసుకురావ‌డం, ఆర్థికంగా స‌హాయాలు చేయ‌డం ఆయ‌న్ను ఎక్కడికో తీసుకెళ్లిపోయాయి.

ఇప్పుడు సోనూసూద్ మ‌రో కొత్త ప‌ని చేయ‌బోతున్నారంట‌. అంటే ఇదేదో ఒక్క‌సారి చేసి వ‌దిలేసేది కాదు. ఆయ‌న పేద విద్యార్థుల‌కు స్కాల‌ర్‌షిప్‌లు అందించేందుకు సిద్ద‌మ‌య్యారంట‌. వార్షిక ఆదాయం రూ. 2 ల‌క్ష‌ల కంటే త‌క్కువ‌గా ఉన్న విద్యార్థులకు స్కాల‌ర్‌షిప్‌లు ఇవ్వాల‌నుకుంటున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. ఇందుకోసం ఇప్ప‌టికే విశ్వ‌విద్యాల‌యాల‌తో ఒప్పందం కుదుర్చుకున్న‌ట్లు సోనూ తెలిపారు.

సోనూకు త‌న త‌ల్లి అంటే చాలా ఇష్టం. ఆమె పేరు స‌రోజ్ సూద్‌. ఈమె పంజాబ్‌లో పిల్ల‌ల‌కు ఉచితంగా పాఠాలు చెప్పేవారు. సోనూకు ఈమె ఆద‌ర్శ‌మ‌ట‌. పేద విద్యార్థుల‌కు స‌హాయం చేయాల‌ని త‌న త‌ల్లి చాలా సార్లు చెప్పింద‌ని సోనూ చెబుతూ ఉంటారు. అందుకే ఆమె పేరుతో స్కాల‌ర్‌షిప్‌లు ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు చెప్పారు. స్కాల‌ర్‌షిప్‌లు కావాల‌నుకునే వారు వార్షిక ఆదాయంతో పాటు మంచి మార్కులు కూడా తెచ్చుకోవాల‌నేది ష‌ర‌తు పెట్టారు. ఇలాంటి వారి కోర్సు ఫీజు, వ‌స‌తి, భోజ‌నం అన్నీ తామే చూసుకుంటామ‌న్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here