ప్ర‌పంచ దేశాల‌ను ఆక‌ర్షిస్తోన్న ఏపీ.. ఇక మంచి రోజులే

ఆంధ్ర‌ప్ర‌దేశ్ పారిశ్రామిక రంగం వైపు అడుగులు వేస్తోంది. ప్ర‌భుత్వం తీసుకుంటున్న విధానాలే ఇందుకు కార‌ణంగా చెప్పొచ్చు. గ‌త ప్ర‌భుత్వానికి భిన్నంగా ప్ర‌చార ఆర్భాటాల‌కు దూరంగా ఉంటూ ఏపీని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి జ‌రుగుతోంది.

ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో ఏపీకి ఇప్ప‌టికే అగ్ర‌స్థానం ద‌క్కింది. పైగా ఏపీ స‌రికొత్త పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చింది. దీంతో ప‌రిశ్ర‌మ‌ల‌కు స్వాగ‌తం ప‌లికేందుకు అవ‌కాశాలు మెండుగా ఉన్నాయ‌ని చెబుతున్నారు. ఏపీలో మౌళిక వ‌స‌తుల‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ద పెట్టిన‌ట్లు అర్థ‌మ‌వుతోంది. భావ‌న‌పాడు నుంచి రామాయ‌ణ‌ప‌ట్నం వ‌ర‌కు పోర్టుల నిర్మాణంపై ఫోక‌స్ చేసిన‌ట్లు క‌నిపిస్తోంది. మీడియం పోర్టుల‌ను ప్ర‌భుత్వ‌మే పెట్టుబ‌డులు పెట్టి పూర్తి చేసేందుకు క‌స‌ర‌త్తులు చేస్తోంది.

ఇక ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి మేక‌పాటి గౌతంరెడ్డి కూడా త‌న బాధ్య‌త‌లు పూర్తి స్థాయిలో నిర్వ‌ర్తిస్తున్నారు. ఏపీకి పెట్టుబ‌డులు తీసుకొచ్చేందుకు ఆయ‌న తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఢిల్లీలో ప‌లువురు కేంద్ర‌మంత్రుల‌తో భేటి అయిన ఆయ‌న ఏపీకి తీసుకురావాల్సిన పెట్ట‌బడులు, ఏ ఏ అంశాల్లో అవ‌కాశాలున్నాయో స్ప‌ష్టంగా వివ‌రిస్తున్నారు. ఇక దొన‌కొండ‌లో అంత‌రిక్ష ప‌రిశోధ‌నల‌కు అనుకూలంగా వ్య‌వ‌స్థ ఏర్పాటుకు అన్ని అవ‌కాశాలు ఉన్నాయ‌ని భావిస్తున్నారు. దీనికి తోడు అక్టోబ‌రులో విశాఖ కేంద్రంగా డిజిట‌ల్ స‌ద‌స్సు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తానికి ఏపీలో ఉన్న మౌళిక వ‌స‌తుల‌ను బ‌ట్టి కేంద్రం నుంచి కూడా స‌హాయ స‌హ‌కారాలు ఉంటాయ‌ని మేధావులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here