ఇప్పట్లో నాకు అలాంటి ఆలోచన లేదు: సోనూ సూద్

కరోనా సంక్షోభ సమయంలో ఎంతో మందికి అండగా నిలుస్తూ మంచి పేరు సంపాదించుకున్నాడు నటుడు సోనూసూద్. ఆపదలో ఉన్న వారికి సాయం చేస్తూ సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారాడు. దీంతో చాలామంది సోనూసూద్ ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇదే క్రమంలో చాలా మంది రాజకీయ నాయకులు కూడా సోను సూద్ ను ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆహ్వానిస్తున్నారు. అయితే ఈ విషయమై సోను స్పందిస్తూ… ‘ నా పొలిటికల్ ఎంట్రీపై ఇప్పటికే చాలాసార్లు స్పష్టతనిచ్చాను.

అయినా చాలామంది పదేపదే అడుగుతున్నారు.. ఇప్పట్లో నాకు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన లేదు. ప్రజలకు సేవ చేయాలనుకుంటే కచ్చితంగా రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదు కదా. నటుడిగా నేను చేయాల్సింది చాలా ఉంది.. ఇంకా చాలా సినిమాల్లో నటించాల్సి ఉంది. ప్రస్తుతం ఎవరితో సంబంధం లేకుండా నాకు తోచిన సాయాన్ని నేను చేస్తూ పోతున్నాను. రాజకీయాల్లోకి వస్తే ఇలాంటి పరిస్థితి ఉంటుందో లేదో తెలియదు. కానీ ఒకవేళ రాజకీయాల్లోకి వస్తే మాత్రం ఇంతకంటే గొప్పగా ప్రజలకు సేవ చేస్తాను’ అని చెప్పుకొచ్చాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here