చైనాకు స్ట్రాంగ్ వార్నింగ్.. దెబ్బకొట్టిన భారత్

భార‌త్ చైనా మ‌ధ్య నెల‌కొన్న ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం అంత‌ర్జాతీయ స్థాయిలో చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఎస్‌.సి.వో ర‌క్ష‌ణ మంత్రుల స‌మావేశంలో ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చైనా దురుసుత‌నాన్ని బ‌ట్ట‌బ‌య‌లు చేశారు.

భార‌త్ విష‌యంలో చైనా అవ‌లంబిస్తున్న తీరును రాజ్‌నాథ్ సింగ్ అంత‌ర్జాతీయ వేదిక‌లో ఎండ‌గ‌ట్టారు. స‌రిహ‌ద్దుల్లో బ‌ల‌గాల‌ను వెంట‌నే ఉప‌సంహ‌రించుకోవాల‌ని రాజ్‌నాథ్ తెగేసి చెప్పారు. డైరెక్టుగా ఇండైరెక్టుగా చైనాపై రాజ్‌నాథ్ మండిప‌డ్డారు. స‌రిహద్దులో చైనా ఏ విధంగా వ్య‌వ‌హ‌రిస్తుందో ఆయ‌న స్ప‌ష్టంగా చెప్పారు.

ఇరుదేశాల మ‌ధ్య అత్యున్న‌త స్థాయి స‌మావేశం జ‌ర‌గ‌డం ఇటీవ‌ల ఇదే మొద‌టిసారి. ఈ స‌మావేశంలో చైనా ర‌క్ష‌ణ శాఖ మంత్రి వెయ్ ఫెంజె పాల్గొన్నారు. దీంతో రాజ్‌నాథ్ సింగ్ భార‌త్ వైఖ‌రిని కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు చెప్పేశారు. ఈ ప‌రిస్థితులు రాక ముందు ఎలాంటి స్థితులు ఉండేవో అలాంటి ప‌రిస్థితులు ఇప్పుడు మ‌ళ్లీ వ‌చ్చేలా ప్ర‌వ‌ర్తించాల‌ని సూచించారు. ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డేందుకు అవ‌స‌ర‌మైతే చ‌ర్చ‌లు జ‌రిపేందుకు ముందుకు రావాలని ఆయ‌న పిలుపునిచ్చారు.

మ‌రి భార‌త్ ప్ర‌క‌ట‌న‌ను చైనా ఏ విధంగా తీసుకుంటుందో వేచి చూడాలి. ఎందుకంటే ఇప్ప‌టికే చైనా భార‌త్‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు చెబుతూనే స‌రిహ‌ద్దులో బ‌ల‌గాలు పెంచుకుంటూ పోతోంది. దీంతో ఏ క్ష‌ణం ఏం జ‌రుగుతుందోన‌న్న ఆందోళ‌న నెల‌కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here