ఈ పోలీస్ ఉండ‌టం మ‌నం చేసుకున్న అదృష్టం..

పోలీసంటే మమ్మల్ని ఎవ్వరూ ఏమి చెయ్యేరులే అనుకునే వాళ్లకి ఆయన గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు. అవినీతి ఆరోపణలు, అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కొరడా జులిపిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో ఆయనే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు.

ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఇప్పుడు సినిమాల్లో ఎస్పీలాగా అందరిని తన వైపు తిప్పుకుంటున్నారు. అయితే అది యాక్టింగ్ ఇది రియల్. ఎస్పీ సిద్దార్థ్ జిల్లా పోలీసులకు తన సత్తా ఏంటో చూపిస్తున్నారు. క్రిమినల్స్ తో ఎలా వ్యవహరిస్తారో సొంత శాఖలో అవినీతి అక్రమాలకు పాల్పడే వారిపై కూడా అదేవిధంగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు తమ విధులు సక్రమంగా నిర్వర్తించాలని ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో సివిల్ పంచాయతీలు చేస్తున్న ఒంగోలు తాలూకా సీఐ లక్ష్మణ్ పై ఆయన సస్పెన్షన్ వేటు వేశారు. ఈయనతో ప్రారంభమైన ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒక్క సిఐలు మాత్రమే కాదు ఎస్సైలు, కానిస్టేబుల్ స్థాయి వరకు తప్పు చేసిన అందరిపై ఆయన చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న 38 మంది క్షేత్ర స్థాయి సిబ్బందిపై ఆయన బదిలీ వేటు వేసి హాట్ టాపిక్ గా మారారు.

కోమరోలు ఎస్సై మల్లికార్జున, దోర్నాల ఎస్సై అబ్దుల్ రెహ్మాన్, గుడ్లూరు ఎస్సై కె. పాండురంగారావు లపై అవినీతి ఆరోపణలు రావడంతో పాటు ప్రజలతో దురుసుగా ప్రవర్తిస్తున్నారన్న కారణంతో వీ.ఆర్.కు పంపారు. ఇలా ఎస్పీ సిద్దార్థ్ తనదైన శైలిలో సొంత శాఖలో తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 50 మందికి పైగా పోలీసులపై ఆయన చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసంటే ప్రజలకు ధైర్యం ఇచ్చి రక్షణగా నిలవాలి కానీ అవినీతి అక్రమాలు చేయడం కాదన్నది ఆయన నిరూపిస్తున్నారు. ఈ రోజుల్లో ఇలాంటి పోలీసు ఉండ‌టం మ‌న అదృష్ట‌మ‌ని ప‌బ్లిక్ అనుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here