సోనియాగాంధీ బ‌ర్త్‌డే.. ప్ర‌ధాని మోదీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..

కాంగ్రెస్‌, బీజేపీ ఈ రెండు పార్టీల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. భార‌త దేశ రాజ‌కీయాల్లో ఈ రెండు పార్టీల పాత్ర ఎంతో ఉంది. ఇన్నాళ్లూ కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలించింది. 2014 ఎన్నిక‌ల నుంచి దేశంలో బీజేపీ హ‌వా కొన‌సాగుతోంది. నేడు కాంగ్రెస్ అగ్ర నాయ‌కురాలు సోనియాగాంధీ బ‌ర్త్‌డే.

సోనియా బ‌ర్త్‌డే సంద‌ర్బంగా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సంబ‌రాలు చేసుకుంటున్నాయి. పార్టీ కార్యాల‌యాల్లో కేక్ క‌టింగ్‌లు ఏర్పాటుచేశారు. ఇక ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ సైతం సోనియాగాంధీ పుట్టిన‌రోజు సంద‌ర్బంగా ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. మోదీ ఏమ‌న్నారంటే.. శ్రీమతి సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆమెకు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షిస్తున్నాను అని మోదీ ట్వీట్ చేశారు.

సోనియా గాంధీ ఈ ఏడాది తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకోవడం లేదు. దేశంలో కోవిడ్-19 మహమ్మారితోపాటు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆమె తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకోరాదని నిర్ణయించుకున్నారు. కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రి నితిన్ గడ్కరీ కూడా సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆమె ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని ఆకాంక్షిస్తూ ఓ ట్వీట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here