సిల్క్‌స్మిత బ‌యోపిక్‌లో అన‌సూయ‌..?

ఇండ‌స్ట్రీలో బ‌యోపిక్‌లు ఇటీవ‌ల స‌ర్వ‌సాదార‌ణం అయిపోయాయి. అయితే వీటిలో కొందరి బ‌యోపిక్‌లు మాత్రం చాలా ఇంట‌స్ట్రింగ్‌గా ఉంటాయి. దీనిలో ప్ర‌ధాన‌మైన‌ది సిల్క్‌స్మిత బ‌యోపిక్ అని చెప్పొచ్చు.

నటి, యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌ అలనాటి శృంగార తార సిల్క్‌ స్మిత బయోపిక్‌లో నటించనుందటూ వార్తలు సోషల్‌ మీడియాలో తెగ హల్‌ చేశాయి. అయితే వార్తలకు అనసూయ తన ట్విట్టర్‌ ద్వారా క్లారిటీ ఇచ్చింది. తాను సిల్క్‌ స్మిత బయోపిక్‌ల నటించడం లేదంటూ చెప్పేసింది. ఇటీవల తాను విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి సినిమాల నటిస్తున్నానంటూ అనసూయ తెలియజేసిన సంగతి తెలిసిందే. సిల్క్ స్మిత తరహాలో మేకప్ వేసుకుని షూటింగ్‌లో పాల్గొంటున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దీంతో అందరూ అనసూయ సిల్క్‌ పాత్రల నటిస్తుందని భావించారు. ఏదైతేనేం అనసూయ తనపై వస్తున్న రూమర్స్‌కు క్లారిటీ ఇచ్చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here