మ‌హిళ‌ల‌ను పాకిస్తాన్ ఏం చేస్తుందో తెలుసా..

ఒక దేశానికి చెందిన వారు మ‌రో దేశంలో ఉండ‌టం మ‌న‌కు తెలిసిందే. అలాగే ఇండియాకు చెందిన ఎంతో మంది మ‌హిళ‌లు పాకిస్తాన్‌లో ఉంటున్నారు. హిందూవులు, క్రైస్త‌వు మ‌హిళ‌లు పాకిస్తాన్‌లో హింస‌కు గుర‌వుతున్నారు. దీనికి సంబంధించిన వివ‌రాల‌ను అమెరికా అంబాసిడర్ ఎట్-లార్జ్ (అంతర్జాతీయ మత స్వేచ్ఛ) సామ్యూల్ డీ బ్రౌన్‌బ్యాక్ తెలిపారు.

అమెరికన్ మీడియా 2019 డిసెంబరులో వెల్లడించిన వివరాలను గుర్తు చేసుకోవాలి. 2018-2019 మధ్య కాలంలో చైనా పురుషుల కోసం 629 మంది పాకిస్థానీ యువతులను అమ్మినట్లు అమెరికన్ మీడియా పేర్కొంది. ఈ యువతుల వివరాలతో కూడిన జాబితాను కూడా ప్రచురించింది. ఈ జాబితాను పాకిస్థానీ దర్యాప్తు అధికారులు రూపొందించినట్లు పేర్కొంది. ‘ఫోర్స్‌డ్ బ్రైడ్స్’ను చైనా తీసుకెళ్లి, అక్కడ వ్యభిచారంలోకి దించుతున్నట్లు తెలిపింది.

అమెరికా అంబాసిడర్ ఎట్-లార్జ్ (అంతర్జాతీయ మత స్వేచ్ఛ) సామ్యూల్ డీ బ్రౌన్‌బ్యాక్ ఈ వివ‌రాల్లో ప‌లు ఆశ్చ‌ర్య‌క‌ర విష‌యాలు బ‌య‌ట‌కు తెలిశాయి. పాకిస్థాన్‌లో మైనారిటీలుగా ఉన్న హిందువులు, క్రైస్తవులు అనేక రకాలుగా హింసకు గురవుతున్నారు. వారికి కనీస మానవ హక్కులు సైతం లభించడం లేదు. హిందూ, క్రైస్తవ యువతులు అక్రమంగా అమ్ముడుపోతున్నారు. ఉంపుడుగత్తెలుగానూ, నిర్బంధ వధువులుగానూ మారుతున్నారు.

సామ్యూల్ విలేకర్లతో మాట్లాడుతూ, పాకిస్థాన్‌లోని హిందూ, క్రైస్తవ మహిళలను ఉంపుడుగత్తెలుగానూ, ‘బలవంతపు’ వధువులుగానూ చైనాకు అమ్ముతున్నారని తెలిపారు. చైనా పురుషులకు ‘ఫోర్స్‌డ్ బ్రైడ్స్’ను సమకూర్చే మార్గాల్లో ఇదొకటి అని తెలిపారు. పాకిస్థాన్‌లో సమర్థవంతమైన మద్దతు లేకపోవడం, మతపరమైన మైనారిటీల పట్ల వివక్ష ఉండటం వల్ల మైనారిటీలు అత్యధికంగా బాధితులవుతున్నట్లు చెప్పారు. అంతర్జాతీయ మత స్వేచ్ఛ చట్టం ప్రకారం పాకిస్థాన్‌ను ‘కంట్రీ ఆఫ్ పర్టిక్యులర్ కన్సర్న్’గా పేర్కొనడానికి ఇదొక కారణమని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here