జగన్ భయపడేవాడు కాదు : సోషల్ మీడియా నెటిజన్లు

వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ తలపెట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర రాష్ట్రంలో అద్భుతంగా నడుస్తుంది. ఈ సందర్భంగా జగన్ ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ ఆనాడు పార్లమెంట్లో ఇచ్చిన హామీని కేంద్ర ప్రభుత్వం అమలు చేయకపోతే వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తారని ప్రకటించడం జరిగింది. దీంతో మైండ్ బ్లాక్ అయిన టీడీపీ గ్యాంగ్.. ఒక్కొక‌రుగా బ‌య‌ట‌కి వ‌చ్చి జ‌గ‌న్ పై అర్ధం ప‌ర్ధం లేకుండా కూత‌లు కూస్తున్నారు.

ఈ సందర్భంగా తెలుగుదేశం సీనియర్ నాయకుడు జగన్ మీద సంచలన కరమైన వ్యాఖ్యలు చేశారు.తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని కూడబెట్టిన అక్రమాస్తులన్నింటినీ ప్రజలకు అప్పగించిన తర్వాతే పాదయాత్ర చేయాల‌ని.. లేని య‌డ‌ల జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర ఆపేయాల‌ని దిక్కుమాలిన‌ డిమాండ్ కూడా చేశారు. దీంతో సోష‌ల్ మీడియాలో వైసీపీ అభిమానులు టీడీపీ బ్యాచ్ పై ఎదురుదాడి మొద‌లు పెట్టారు.ఓటుకు డబ్బులు ఇస్తూ అడ్డంగా దొరికిపోయిన నాయకుడులా భయపడి కోర్ట్ నుండి స్తేలు తెచ్చుకోలేదు జగన్.త‌ప్పు చేయ‌లేదు కాబ‌ట్టే ధైర్యంగా ఎదుర్కొంటున్నాడ‌ని పేర్కొన్నారు జగన్ అభిమానులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here