స్పెషల్ స్టేటస్ జగన్ లాంటిది స్పెషల్ పెకేజ్ లోకేష్ లాంటిది: రోజా

వైసిపి ఫైర్ బ్రాండ్ నగరి ఎమ్మెల్యే రోజా తెలుగుదేశం నేతల మీద ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మీద మండిపడ్డారు. తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో రోజా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ మీద పంచ్ లు విసిరారు… ప్ర‌త్యేక హోదా జ‌గ‌న్ లాంటిది.. ప్యాకేజీ లోకేష్ లాంటిది..!! మీకు ఏది కావాలి ? అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా ప్ర‌శ్నించారు. చంద్రబాబు లోకేష్ లను ఆడేసుకున్నారు వైసీపీ ఎమ్మెల్యే రోజా.

ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో పోరాడాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటువంటి కీలకమైన సమయంలో రాష్ట్రాన్ని విడిచి విదేశాలకు వెళ్లడం సిగ్గు చేటు అని అన్నారు రోజా.ప్ర‌త్యేక హోదాపై చిత్త‌శుద్ధిలేని రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక ప్యాకేజీ అంటూ కేంద్రం వ‌ద్ద సాగిల ప‌డింద‌న్నారు.అలాగే తెలుగుదేశం ప్రజాప్రతినిధుల అయినా టిడిపి ఎంపీలు కేంద్ర మంత్రుల గురించి మాట్లాడుతూ ఓవైపు ప్లకార్డులు పట్టుకుని మరోవైపు కేంద్రమంత్రి పదవి అంటిపెట్టుకుని రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు తెలుగుదేశం నాయకులు. ఎన్నికలలో పోటీ చెయ్యకుండా మంత్రి పదవి అనుభవిస్తున్న లోకేష్ అమెరికాలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తెస్తాన‌ని అనటం సిగ్గుచేటు అని అన్నారు రోజా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here