పవన్ కళ్యాణ్ ని స్టోరీ ఇదే : మహేష్ బాబు అక్క

ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు అక్క మంజుల ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. తాను దర్శకత్వం వహించిన  మనసుకు నచ్చింది సినిమా నేపథ్యంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టమని అంతేకాకుండా వ్యక్తిత్వం అంటే మహా ఇష్టమని చెప్పడం జరిగింది మంజుల.అంతేకాకుండా ఆయన ఒప్పుకుంటే సినిమా చేస్తానని కూడా చెప్పింది మంజుల.

అయితే ఈసారి మంజుల తాను దర్శకత్వం వహించిన సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా పవర్ స్టార్ కోసం తయారు చేసుకున్న కథపై మాట్లాడుతూ, సినిమా రంగంలో టాప్ పొజిషన్ లో ఉన్న ఓ హీరో, ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతో రాజకీయాల్లోకి ఎలా వెళ్లాడన్న విషయంపై కథ రాసుకున్నట్టు చెప్పుకొచ్చింది.

అంతేకాకుండా మహేష్ బాబు పై కూడా చాలా కథలు రాసి పెట్టుకుని ఉందంట మంజుల. అయితే ఈ క్రమంలో మంజుల మాట్లాడుతూ తాను హీరోను దృష్టిలో పెట్టుకుని కథ రాయనని, కథ రాశాక ఎవరు సరిపోతారా? అని ఆలోచిస్తానని పేర్కొంది. మరి పవన్ కళ్యాణ్ మహేష్ మహిళతో ఎప్పుడు సినిమా తిస్తారో?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here