ఎన్టీఆర్, ఏఎన్నార్‌లను ఆ విధంగా చూపుతారట!

అలనాటి అందాల మేటి నటి సావిత్రి జీవిత కథను మహానటిసావిత్రి బయోపిక్ తో తెరకెక్కిస్తున్నారు ప్రముఖ నిర్మాతలు వైజయంతీ మూవీస్ అధినేతలు అశ్వినీ దత్,ప్రియాంక దత్. ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు వైజయంతి మూవీస్ బ్యానర్ వారు. ఈ సినిమాలో మహానటి సావిత్రి పాత్రను హీరోయిన్ కీర్తి సురేష్ పోషిస్తున్నారు.అంతేకాకుండా ఈ సినిమాలో సమంతా కూడా నటిస్తుంది.

ఈ సినిమా దర్శకుడు ‘ఎవడే సుబ్రమణ్యం’ ఫేం నాగ అశ్విన్.ఈ సినిమాను వచ్చేనెల 29న విడుదల చేయనున్నారు. సావిత్రి అనగానే అలనాటి దిగ్గజ నటులు ఎన్టీఆర్, ఏఎన్నార్‌లు కూడా గుర్తుకొస్తారు. ఆ నటులతో సావిత్రి కలిసి నటించిన సన్నివేశాలను డిజిటల్ రూపంలో ఈ సినిమాలో చూపనున్నారట. దీంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. ఈ సినిమా మీద ప్రేక్షకులకు అంచనాలు బానే ఉన్నాయి.మహానటి సావిత్రి కథ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి తెలుగు ఇండస్ట్రీలో కూడా ఈ సినిమా మీద ఆసక్తి నెలకొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here