చలో దర్శకుడికి నాగ శౌర్య గిఫ్ట్!

ఇండస్ట్రీలో సరైన హిట్ ఇస్తే సదరు సినిమా హీరోలు ఆ సినిమా డైరెక్టర్ కి గిఫ్ట్లు ఇస్తున్నారు. ఈ ట్రెండ్ కొంతకాలం నుండి కొనసాగుతోంది మొన్న సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అవడంతో మహేష్ డైరెక్టర్ కొరటాల శివకి కార్ ని గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది. ఇదే క్రమంలో తాజాగా గత కొంత కాలం నుండి ఫ్లాపులతో సతమతమవుతున్న తెలుగు ఇండస్ట్రీ యువహీరో నాగ శౌర్య కి చలో సినిమా హిట్ అవడంతో ఆ సినిమా కొత్త డైరెక్టర్ వెంకీ కుడుముల కు హీరో నాగ శౌర్య కార్ గిఫ్ట్ గా ఇస్తున్నాడట !!

మంచి విజయం అందుకున్న దర్శకుడు వెంకీ కుడుములకు వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే హారిక హాసిని బ్యానర్ లో ఓ సినిమాకు సిద్ధం అయ్యాడు. దాంతో పాటు యువి బ్యానర్ లో మరో సినిమా లైన్ లో ఉంది. ప్రస్తుతం చలో సినిమా మంచి వసూళ్లు రాబడుతోంది.ఈ సందర్భంగా హీరో నాగ శౌర్య వచ్చిన విజయంతో ముందుకు దూసుకెళ్లేపోవడానికి వరుస సినిమాలను లైన్లో పెట్టాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here