పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరాడు: బీజేపీ ఎమ్మెల్యే

తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు సీనియర్ నాయకుడు అంబర్ పెట్  ఎమ్మెల్యే కిషన్ రెడ్డి  జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మీద సంచలన కారమైన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరాడు అలాగే సినిమాలకు కూడా పనికిరాడు అని ఎద్దేవా చేశారు కిషన్ రెడ్డి. ఆయన మీడియాతో మాట్లాడుతూ అప్పట్లో ఇండస్ట్రీలో టాప్ హీరో స్థాయిలో ఉన్న మెగాస్టార్ చిరంజీవి అండతో సినిమాల్లోకి వచ్చాడు.నటన రాకపోయినా సరే తన అన్నను చూసి అవకాశాలు వచ్చాయి.

అసలు సరిగ్గా కదలకుండా డైలాగ్ కూడా చెప్పడం రాని పవన్ కళ్యాణ్ ఇతర భాషల్లో హిట్ అయిన సినిమాలను మాత్రమే ఇక్కడ తీసి పెద్ద హీరో స్థాయికి ఎదిగారు తప్పా సొంతగా ఎదగలేదు అని ఆయన అన్నారు. అంతేకాకుండా పవన్‌ కల్యాణ్‌ హావభావాలు చూస్తే నవ్వొస్తోందని అన్నారు కిషన్ రెడ్డి. మరి అదే విధంగా రాజకీయాల్లో రాణించాలంటే ప్రజాసేవ చేసే చిత్తశుద్ధి ఉండాలని కానీ పవన్ కళ్యాణ్ మీడియా ద్వారా రాజకీయ నాయకుడు కావాలని ఆరాటపడుతున్నాడు అని అన్నారు.

మీడియా ద్వారా ఇప్పటి వరకు ఏ రాజకీయనాయకుడు రాజకీయాలలో రాణించిన దాఖలాలు లేవు అని పవన్ మీద ధ్వజమెత్తారు. ఎవరైనా రాజకీయాల్లో రాణించాలంటే ప్రజల అండ ఉండాలని తెలియజేసారు బిజెపి సీనియర్ నాయకుడు కిషన్ రెడ్డి. ప్రశ్నించడానికి పార్టీ పెట్టాడన్న పవన్ కళ్యాణ్ అధికారంలో ఉన్న పార్టీలను పోవడానికి సమయం కేటాయించారని మండిపడ్డారు కిషన్ రెడ్డి. మరి కిషన్ రెడ్డి  చేసిన వ్యాఖ్యల మీద పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here