క‌రోనాతో ఒక్క‌రోజులోనే ఇంత మంది చ‌నిపోయారు..

క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ మ‌ళ్లీ కొన‌సాగుతోంది. ప్రపంచంలో కరోనా కేసుల సంఖ్య 4.96 కోట్లను దాటింది. 3 కోట్ల 52 లక్షల34 వేల 120 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా కారణంగా ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 1.55 కోట్ల మంది కన్నుమూశారు.

కరోనా వైరస్ గురించి తాజా సమాచారాన్ని అందించే వరల్డ్ మీటర్స్‌ను అ‌నుసరించి అమెరికా, యూరప్‌లలో కరోనా వైరస్ తీవ్ర స్థాయికి చేరింది. బ్రిటన్‌లో తాజాగా కరోనాతో 413 మంది కన్నుమూశారు. అమెరికాలో వరుసగా ఎనిమిదవ రోజు ఒక లక్షకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. యూరప్ దేశాలలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. లాక్‌డౌన్ ఎత్తివేసిన తరువాత ఎటువంటి నింబధనలు లేకపోవడంతోనే కరోనా కేసులు పెరుగుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. బ్రిటన్‌లో ఇప్పటి వరకూ కరోనాతో 50 వేల మంది మృతి చెందారు.

అమెరికాలో తాజాగా ఒక్కరోజులో ఒక లక్షా 26 వేల కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య కూడా వెయ్యి దాటింది. అమెరికాలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇత‌ర దేశాల‌తో పోలిస్తే ఇండియా చాలా బెట‌ర్‌గా చెప్పుకోవ‌చ్చు. ఇండియాలో రిక‌వ‌రీలు 92 శాతం ఉన్నాయి. క‌రోనా సెకండ్ వేవ్ కొన‌సాగుతోంద‌న్న ఆందోళ‌న అంద‌రిలోనూ ఉంది. మ‌రొక ఆరు నెల‌లైనా జాగ్ర‌త్త‌లు పాటిస్తేనే వ్యాక్సిన్ వ‌చ్చే వ‌ర‌కు ప్ర‌జ‌ల ప్రాణాలు కాపాడుకోవ‌చ్చ‌ని మేధావులు అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here