ప్ర‌భాస్ ఛాలెంజ్‌కు అదిరిపోయే జ‌వాబిచ్చిన రాం చ‌ర‌ణ్‌..

హీరో ప్ర‌భాస్ ఇచ్చిన ఛాలెంజ్‌కు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ స‌మాధానం ఇచ్చాడు. ఇంత‌కీ ప్ర‌భాస్ ఏం ఛాలెంజ్ ఇచ్చార‌నుకుంటున్నారా. ఇటీవ‌ల సెల‌బ్రెటీలంద‌రినీ క‌దిలిస్తున్న అంశం గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌. ఈ ఛాలెంజ్‌లో భాగంగా సెలబ్రెటీలంద‌రూ త‌మ వంతు బాద్య‌త‌గా మొక్క‌లు నాటుతున్నారు.

ప్ర‌భాస్ మొక్కలు నాట‌డ‌మే కాకుండా రాం చ‌ర‌ణ్‌కు ఛాలెంజ్ విసిరారు. దీంతో రాం చ‌ర‌ణ్ జూబ్లీహిల్స్‌లోని త‌న ఇంట్లో మొక్క‌లు నాటారు. ఈ కార్య‌క్ర‌మంలో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా రాం చ‌ర‌ణ్ మాట్లాడుతూ ప్ర‌భాస్ మొక్క‌లు నాట‌డ‌మే కాకుండా త‌న‌కు ఈ అవ‌కాశం ఇవ్వ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. మొక్క‌లు పెంచ‌డ‌మ‌నేది అంద‌రి క‌ర్త‌వ్య‌మ‌న్నారు. అంద‌రూ దీన్ని దృష్టిలో పెట్టుకోవాల‌న్నారు. ప్రకృతి సమతూల్యంతో ఉంటేనే మనమందరం ఈ భూమి మీద మనగలుగుతామ‌ని.. లేదంటే విపత్తులతో ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు.

తన వంతు బాధ్యతగా కొన్ని లక్షల మందిని తన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా కదిలిస్తున్న జోగినిపల్లి సంతోష్‌ను మ‌న‌స్పూర్తిగా అభినందిస్తున్న‌ట్లు చెప్పారు. ఇది ఇలాగే కొన‌సాగాల‌ని రాం చ‌ర‌ణ్ అన్నారు. మెగా ఫ్యామిలీ అభిమానులు అంద‌రూ ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ముందుకు తీసుకువెళ్లాల‌ని చెప్పారు. హీరోయిన్ ఆలియా భ‌ట్‌తో పాటు డైరెక్ట‌ర్ రాజ‌మౌళి, ఆర్‌.ఆర్‌.ఆర్ మూవీ యూనిట్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీక‌రించాల‌న్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here