నేను అక్కడికి వెళ్లట్లేదు… వెళ్లను కూడా!

ప్రపంచ వ్యాప్తంగా బిగ్ బాస్ రియాలిటీ షో ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది. తెలుగులోనూ టెలికాస్ట్ అయిన ఈ షో విజయవంతంగా మూడు సీజన్లను పూర్తి చేసుకుంది. ఇక తాజాగా నాలుగో సీజన్ సెప్టెంబర్ 6 నుంచి ప్రారంభం కానుంది. ఈసారి బిగ్ బాస్ ఇంటిలోకి అడుగుపెట్టేది వీరేనంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొట్టాయి. సింగర్ సునీత కూడా ఈ సారి బిగ్ బాస్ షోలో పాల్గొననుందని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై తాజాగా సునీత స్పందిస్తూ…’ నేను బిగ్ బాస్ లోకి వెళ్తున్నాను అంటూ వస్తున్న వార్తలు నిజం కావు. అసలు ఈ సీజన్లోనే కాదు నేను ఇప్పటికీ.. బిగ్ బాస్ లాంటి రియాల్టీ షోలో పాల్గొనను. నా మనస్తత్వానికి బిగ్ బాస్ షో ఫార్మాట్ పూర్తి విరుద్ధమ’ని చెప్పుకొచ్చిందీ సింగర్.

ఇదిలా ఉంటే బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ ఎవరు అనే విషయంలో ఈనెల 6వ తారీకు సాయంత్రం ఆరు గంటలకు మా టీవీలో ప్రసారం కాబోతున్న షో తో క్లారిటీ రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here