మోదీ అకౌంట్ల‌కు భ‌ద్ర‌త ఉందా..?

దేశంలో సామాన్యుల నుంచి సంప‌న్నుల వ‌ర‌కు ఎవ్వ‌రికీ భ‌ద్ర‌త లేకుండా పోతుంది. తాజాగా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ట్విట్ట‌ర్ ఖాతా హ్యాక్‌కు గురైంది. సైబ‌ర్ నేర‌గాళ్లు మోదీ ట్విట్ట‌ర్‌ను హ్యాక్ చేశారు.

న‌రేంద్ర మోదీ ట్విట్ట‌ర్‌ను  హ్యాక్ చేసిన వారు కోవిడ్ 19 క‌ట్ట‌డి కోసం పీఎం జాతీయ స‌హాయ నిధికి విరాళాలు అంద‌జేయాల‌ని కోరారు. హ్యాక్‌కు గురైన ఈ ట్విట్ట‌ర్ అకౌంట్లో ప్ర‌ధానికి 25 ల‌క్ష‌ల మంది ఫాలోవ‌ర్లు ఉన్నారు. ప్ర‌ధాని మోదీ ప్ర‌సంగాల‌కు సంబంధించిన స‌మాచారం మొత్తం ఈ అకౌంట్ ద్వారానే తెలుస్తుంది. మోదీకి మరో ట్విట్ట‌ర్ అకౌంట్ కూడా ఉంది. ఇందులో ప్ర‌ధానిని 6 కోట్ల మందికిపైగా ఫాలో అవుతూ ఉన్నారు. దీన్ని మాత్రం హ్యాక్ చేయ‌లేదు.

అయితే ప్ర‌ధాని ట్విట్ట‌ర్ అకౌంట్ హ్యాక్ చేయ‌డంపై వెంట‌నే ట్విట్ట‌ర్ స్పందించింది. హ్యాక‌ర్లు పెట్టిన మేసేజ్‌లు అన్నీ తొల‌గించింది. దీనిపై ద‌ర్యాప్తు జ‌రుగుతోంద‌ని తెలిపింది. ప్ర‌ధాని మిగ‌తా అకౌంట్ల‌కు ఎలాంటి ఇబ్బందులు లేవ‌ని.. అన్ని ఖాతాలు భ‌ద్రంగా ఉన్న‌ట్లు ట్విట్ట‌ర్ పేర్కొంది. మోదీ అకౌంట్ హ్యాక్ చేశార‌న్న వార్త‌ల‌పై ఒక్క‌సారిగా దుమారం రేగింది.

మోదీ అకౌంట్‌నే హ్యాక్ చేస్తున్న ప‌రిస్థితుల్లో ఇత‌ర వీవీఐపీలు, ప్ర‌ముఖుల అకౌంట్ల‌కు భ‌ద్ర‌త ఏమాత్రం ఉంటుందోన్న ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. అయితే గ‌తంలో ఒబామా, బిల్‌గేట్స్ ట్విట్ట‌ర్ అకౌంట్లు కూడా హ్యాక్ గుర‌య్యాయి. ఇప్ప‌టికైనా హ్యాక‌ర్స్‌ను క‌ట్ట‌డి చేయాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here