పనికి పని..  ఆరోగ్యానికి ఆరోగ్యం. 

సోషల్ మీడియా విస్తృతి పెరిగినప్పటి నుంచి ఏ చిన్న అంశం కాస్త విభిన్నంగా ఉన్నా సరే..  ఇట్టే వైరల్ గా మారుతోంది. తాజాగా అలాంటి ఓ వీడియోనే సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఆరోగ్యంతో పాటు  అవసరాన్నీ ఏక కాలంలో తీర్చుకుంటున్న ఓ మహిళ అందరికీ ఆశ్యర్యానికి గురి చేస్తోంది.

ఇంతకీ విషయమేంటంటే…  సాధారణంగా మనం ఏవైనా ధాన్యాలను పిండి పట్టించాలంటే దగ్గర్లో ఉన్న గిర్ని దుకాణానికి వెళతాం. అయితే ఓ మహిళ మాత్రం వినూత్నంగా ఆలోచించింది. ఇంట్లో ఉన్న జిమ్ సైకిల్ చక్రానికి కంటైనర్ ను అనుసంధానించింది. ధాన్యాలను ఒక పాత్రలో వేసి…  సైకిల్ తొక్కుతున్నా కొద్దీ పిండి వచ్చేలా సెట్ చేసింది. ఒక వైపు ఆరోగ్యం కోసం సైక్లింగ్ చేస్తుంటే మరోవైపు ఉచితంగా పిండి తయారవుతోంది. ఈ వీడియోను అశ్విన్ శరన్ అనే ఐఏఎస్ ఉద్యోగి గత నెలలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. మరి ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here