నాగ్ మొదలెట్టేశాడు..

కరోనా మహమ్మారి కారణంగా సినిమా చిత్రీకరణలన్నీ  ఆగిపోయాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న సినిమాలు కూడా..  కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా షూటింగ్ ఆపేయాల్సి వచ్చింది. అయితే తాజాగా కేంద్రం ఇచ్చిన సడలింపుల ద్వారా తిరిగి షూటింగ్ లు  మొదలవుతున్నాయి. పలు రక్షణ చర్యలు తీసుకుంటూ ఇప్పటికే కొన్ని సినిమా షూటింగులు మొదలు కూడా పెట్టారు. తాజాగా టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కూడా తన తర్వాతి చిత్రంవైల్డ్ డాగ్చిత్రీకరణను రోజు ( గురువారం) తిరిగి ప్రారంభించాడు. విషయాన్ని నాగ్ అధికారికంగా ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు. మళ్లీ ముఖానికి మేకప్ వేసుకుంటుండగా తీసిన వీడియోను పోస్ట్ చేశాడు.

వైల్డ్ డాగ్’  సినిమాలో నాగార్జున NIA ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. చిత్రంతో  అహిషోర్ సోల్మన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.ఇదిలా ఉంటే నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నబిగ్ బాస్ 4′ నెల 6 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here