జ‌గ‌న్‌ను చూసి కాపీ కొడుతున్నారు..

వై.ఎస్ జ‌గ‌న్ తండ్రికి త‌గ్గ త‌న‌యుడిగా పేరు తెచ్చుకుంటున్నారు. వై.ఎస్ఆర్ త‌న సంక్షేమ ప‌థ‌కాల‌తో దేశంలోనే ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు జ‌గ‌న్ కూడా అదేబాట‌లోనే వెళుతున్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికారం చేప‌ట్టాక వై.ఎస్ జ‌గ‌న్ త‌న మార్క్ పాల‌న కొన‌సాగిస్తున్నారు. అమ్మఒడి లాంటి సంచ‌ల‌నాత్మ‌క ప‌థ‌కాలు తీసుకువ‌చ్చారు. గ్రామ వాలంటీర్లు, స‌చివాల‌యాల ఏర్పాటుతో చ‌రిత్రలో ఓ అధ్యాయాన్ని జ‌గ‌న్ లిఖించార‌ని అంతా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు జ‌గ‌న్ తీసుకుంటుంటున్న నిర్ణ‌యాలు దేశం ఫాలో అయ్యే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి.

రాష్ట్రంలో వైఎస్ అధికారంలో ఉన్న‌ప్పుడు 108 అంబులెన్స్ సేవ‌లు ఏ విధంగా ఉండేవో ప్ర‌త్యేకంగా మ‌నం చెప్పుకోవాల్సిన అవ‌స‌రం లేదు. ఇప్పుడు జ‌గ‌న్ అధికారం చేప‌ట్టాక మ‌ళ్లీ 108,104 అంబులెన్సులు ప్రారంభించారు. ఒకేసారి వెయ్యికి పైగా అంబులెన్సుల సేవ‌లు వై.ఎస్ జ‌గ‌న్ ప్ర‌వేశ‌పెట్టారు. ఇప్పుడు ఇదే విధానాన్న ప‌క్క‌నున్న త‌మిళ‌నాడు స‌ర్కార్ కాపీ కొట్టింది.

క‌రోనా సేవ‌లు మరింత విస్తృతం చేయ‌డ‌మే లక్ష్యంగా తమిళ‌నాడు ముఖ్య‌మంత్రి ప‌ళ‌నిస్వామి 118 అంబులెన్సుల‌ను ప్రారంభించారు. ఏపీలో జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకున్న త‌ర్వాత ఇత‌ర రాష్ట్రాల వారు కూడా ఈ ప‌థ‌కాలు ప్రారంభిస్తున్నారు. దేశంలో జ‌గ‌న్ ట్రెండ్ సెట్ చేస్తున్నార‌ని పొలిటిక‌ల్ డిస్క‌ష‌న్ న‌డుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here