సింగర్ సునీత రెండో పెళ్లి చేసుకోబోతున్నారా..?

ఇండ‌స్ట్రీలో సింగర్ సునీత గురించి తెలియ‌ని వారు ఉండ‌రు. ఆమె పాటల కోసం ఎంతో మంది ఫ్యాన్స్ వేచి ఉంటారు. అప్ప‌టి నుంచి ఇప్ప‌టికీ ఆమెకు ఫాలోయింగ్ త‌గ్గ‌లేదు. కాగా సునీత భ‌ర్త‌కు దూరంగా ఉంటున్నారు. ఇటీవ‌లె ఆమె విడాకులు కూడా తీసుకున్నారు.

మొద‌టి భ‌ర్త నుంచి విడాకులు తీసుకున్న‌ట్లు ఇటీవ‌లె ఆమె తెలిపారు. అయితే ఇప్పుడు ఆమెకు సంబంధించిన ఓ రూమ‌ర్ షికారు చేస్తుంది. సునీత రెండో పెళ్లి చేసుకుంటున్నార‌న్న వార్త వినిపిస్తోంది. డిజిటల్‌ రంగంలో కీలక పాత్రను పోషిస్తున్న ఓ బిజినెస్‌మ్యాన్‌ను సునీత పెళ్లి చేసుకోబోతున్నారని టాక్ వినిపిస్తోంది. సునీత పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తికి కూడా ఇది రెండో పెళ్లేనట. సునీత మొదటి భర్త నుండి విడాకులు తీసుకున్న‌ట్లు చెప్పిన స‌మ‌యంలో… తను ఒంటరి జీవితాన్ని గడుపుతున్నానని, ఈ విషయంలో తనపై వస్తున్న పుకార్లను పట్టించుకోనని అన్నారు. అయితే ఇప్పుడు ఏకంగా రెండో పెళ్లి గురించి వార్త హ‌ల్ చ‌ల్ చేస్తున్న ప‌రిస్థితుల్లో సునీత దీనిపై స్పందిస్తారో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here