ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు న‌టుడిగా మార‌బోతున్నారా..?

తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు తెలియ‌ని వారు ఉండ‌రు. టాలీవుడ్‌ సినిమాలను కమర్షియల్ పేరామీటర్‌లో మరో రేంజ్‌కు తీసుకెళ్లిన దర్శకుల్లో ఈయ‌న ప్ర‌ముఖుడు. ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాలు డైరెక్ష‌న్ చేసిన ఈయ‌న ఓ సినిమాలో న‌టించ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

అయితే ఇందులో ఎంత‌వ‌ర‌కు నిజ‌ముందో తెలియ‌దు కానీ పుకార్లు మాత్రం బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అంతే కాకుండా న‌టుడు, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త‌నికెళ్ల భ‌ర‌ణి ఈ సినిమాకు డైరెక్ష‌న్ చేస్తున్నార‌ని అంటున్నారు. అంత‌కుమించి సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటార‌ని చెబుతున్నారు. వారిలో రమ్యకృష్ణ, సమంత, శ్రియ న‌టిస్తార‌ని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ మ‌రో మూడు నెల‌ల్లో తెలుస్తుంద‌ని జోరుగా ప్ర‌చారం ఉంది. అయితే రాఘవేంద్ర‌రావు సినిమా అంటేనే అంద‌రికీ న‌చ్చి తీరుతుంది. అలాంటిది ఆయ‌న న‌టుడిగా సినిమా అన్న వార్త తెలియ‌గానే అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఇక ఇది నిజ‌మో కాదో తెలియాలంటే ఆయ‌నే స్వ‌యంగా స్పందించాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here