ప్ర‌ముఖ గాయ‌కుడు కి క్షీణించిన‌ ఆరోగ్యం.. ?

ప్ర‌ముఖ గాయ‌కుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం క‌రోనా బారిన పడిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఈయ‌న ఐసీయూలో ఉన్న‌ట్లు తెలుస్తోంది. బాలసుబ్ర‌హ్మ‌ణ్యం ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఈ నెల 5వ తేదీన క‌రోనాతో చెన్నైలోని ఎంజీఎం హాస్పిట‌ల్లో చేరారు. ప్ర‌త్యేక వైద్య బృందం ఆయ‌న‌కు చికిత్స‌లు అందిస్తోంది. ఎంజీఎం ఆసుప‌త్రి వర్గాలు ఆయ‌న ఆరోగ్యానికి సంబంధించి ప్ర‌తి రోజూ బులిటెన్‌ను విడుద‌ల చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో నేడు విడుద‌ల చేసిన బులిటెన్‌లో ఆయ‌న ఆరోగ్యం రాత్రి నుంచి క్షీణించిన‌ట్లు తెలిపారు.

అందుకే రాత్రి నుంచి ఐసీయూలో పెట్టి చికిత్స అందిస్తున్నామ‌న్నారు. అయితే గురువారం సాయంత్రం రిలీజ్ చేసిన హెల్త్ బులిటెన్‌లో ఆయ‌న ఆరోగ్యం బాగానే ఉన్న‌ట్లు తెలిపారు. మ‌రి అంత‌లోనే ఏమైందో తెల‌యాల్సి ఉంది. బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఆరోగ్య ప‌రిస్థితికి సంబంధించి పూర్తి స్థాయి స‌మాచారం ఇంకా రాలేదు. కాగా ఆయ‌న అతి త‌క్కువ క‌రోనా లక్ష‌ణాల‌తోనే ఆసుప‌త్రిలో చేరిన‌ట్లు స‌మాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here