గుడ్ లక్ సఖి టీజర్ ప్రభాస్ చేతుల మీదుగా లాంచ్

పెంగ్విన్ తరువాత కీర్తి సురేష్ మరొక లేడీ ఓరియెంటడ్ కథ తో ప్రేక్షకుల ముందుకి రానుంది. గుడ్ లక్ సఖి అంటూ టైటిల్ తో తాజాగా పోస్టర్ విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ పోస్టర్ కి ప్రేక్షకులు, అభిమానుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్ర టీజర్ ను ఆగస్ట్ 15 న ఉదయం 10 గంటలకు విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

అయితే ఈ చిత్ర టీజర్ ను యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ విడుదల చేయనున్నారు. ఆగస్ట్ 15 ఉదయం పది గంటలకు సోషల్ మీడియా ద్వారా ఫేస్ బుక్ లో ప్రభాస్ విడుదల చేయనున్నారు. గుడ్ లక్ సఖి అంటూ టైటిల్ తో వస్తున్న ఈ చిత్రం లో కీర్తి సురేష్ షూటర్ గా కనిపించనున్నారు. ఈ చిత్రం లో జగపతి బాబు మరియు ఆది పినిశెట్టి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తెలుగు లో ప్రభాస్ విడుదల చేస్తుండగా, తమిళ్ లో విజయ్ సేతుపతి, మలయాళం లో పృథ్వీ రాజ్ సుకుమారన్ విడుదల చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here