పాప్ సింగర్ స్మిత ఫామిలీకి కరోనా పాజిటివ్

కరోనా వైరస్ తెలుగు రాష్ట్రాల్లో వేగంగా వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే. సాధారణ ప్రజలకే కాక కొందరు సినిమా యాక్టర్స్ కి కూడా నిర్ధారణ అవుతున్నాయి. ఇప్పటికే బిగ్ బి,రాజమౌళి, తేజల ఫ్యామిలీ లకు కరోనా సోకగా, తాజాగా పాప్ సింగర్ స్మిత ఫ్యామిలీ కి కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని స్వయంగా స్మితా నే వెల్లడించారు. నిన్న పిచ్చి పిచ్చిగా , చిరాగ్గా ఉంటే, వర్క్ ఔట్స్ వలన అని అనుకున్నా అయితే ఎందుకైనా మంచిదని కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయించుకున్నాం అని అన్నారు.

కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలలో ఆమె భర్త శశాంక్ కి మరియు తనకు కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది అని అన్నారు. ఇటీవల ఒక ఎలక్ట్రీషియన్ వచ్చి వెళ్లాడని అతని ద్వారా కరోనా వైరస్ సోకి ఉంటుందేమో అంటూ అనుమానం వ్యక్తం చేశారు.

విజయవాడకు చెందిన స్మిత పలు పాటలు మరియు ఆల్బమ్స్ ద్వారా ఫేమస్ అయ్యారు. అంతేకాక కొన్ని సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ప్రతిభ కనబరిచారు. మల్లీశ్వరిలో ఆమె పాత్రకి అప్పట్లో చాలా పేరు వచ్చింది.

ఈ వైరస్ భారీ నుండి స్మిత ఫామిలీ త్వరగా కోలుకోవాలని కోరుకుందాం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here