అవాస్తవాలు చిత్రీకరిస్తున్నారని ఆర్జీవీ పై అమృత ఆరోపణలు!

వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మర్డర్ చిత్రం పై అమృత ప్రణయ్ వ్యాఖ్యానించారు. మర్డర్ చిత్రం ట్రైలర్, మరియు తాజాగా విడుదల అయిన పాట చూశానని అవి అవాస్తవాలని ఆరోపించింది. అయితే ఈ వ్యవహారం పై కోర్టు ను ఆశ్రయిస్తానని చెప్పింది. ఈ సినిమా విడుదల నిలిపివేయాలని అమృత న్యాయస్థానం లో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇందుకు సంబంధించిన పిటిషన్ న్యాయస్థానం ఎస్సి, ఎస్టీ కోర్టు కి చేరగా, అక్కడి నుండే దర్శక నిర్మాతలకి నోటీసులు జారీ చేయడం జరిగింది.

అమృత ప్రణయ్ నిజ జీవితంలో జరిగిన సంఘటన ల ఆధారం గా రాంగోపాల్ వర్మ సినిమా తెరకెక్కించడం, అందుకు సంబంధంచిన ట్రైలర్, పాట లు అవాస్తవాలు అంటూ అమృత ఆరోపించడం తో ఈ చిత్రం పై ప్రజలు చర్చలు జరుపుతన్నారు. అయితే వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ మాత్రం ఇటువంటి వాటికి బెదర నని తనను సినిమా తీయకుండా ఎవరూ ఆపలేరని పనిని తన తాను చేసుకుంటూ పోతున్నారు రాంగోపాల్ వర్మ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here