బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి మరో వైల్డ్‌ కార్డు ఎంట్రీ.. ఈసారి ఎవరంటే.?

ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న రియాలిటీ షో.. బిగ్‌బాస్‌. భాషలతో సంబంధం లేకుండా అన్ని ప్రాంతాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోన్న ఈ షో తెలుగులోనూ విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే మూడు సీజన్‌లు పూర్తి చేసుకొని నాల్గో సీజన్‌ కొనసాగుతోంది. ఇక ఐపీఎల్‌ సీజన్‌ను సైతం తట్టుకుంటూ మంచి టీఆర్‌పీని సాధిస్తోందీ షో.

ఇదిలా ఉంటే తాజాగా బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి మరో సెలిబ్రిటీ వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బిగ్‌ బాస్‌ హౌజ్‌ నుంచి అనారోగ్యం కారణంగా గంగవ్వ స్వయంగా తప్పుకోవడంతో ఆమె స్థానాన్ని భర్తీ చేయాలని బిగ్‌బాస్‌ టీమ్‌ యోచిస్తున్నట్లు సమాచారం. ఈసారి వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇవ్వనుంది తెలంగాణకు చెందిన ప్రముఖ టీవీ వ్యాఖ్యాత, సినీ గాయని మంగ్లీ అని సమాచారం. ఈమేరకు మంగ్లీతో ఇప్పటికే చర్చలు కూడా జరిగాయని సమాచారం. తనదైన గాత్రంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తోన్న మంగ్లీ బిబ్‌బాస్ హౌజ్‌లో ఎలాంటి హడావుడి చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here