మరో సినీ జంట పెళ్లి పీట లెక్కనుందా..?

మరో సినిమా జంట వివాహ బంధంతో ఒక్కటి కానుందా.? తమిళ హీరో శింబు.. త్రిషను వివాహం చేసుకోనున్నాడా? ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వార్త తెగ వైరల్‌గా మారింది. గతంలో త్రిష ఒక యంగ్‌ ప్రొడ్యూసర్‌‌ను వివాహం చేసుకోవడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే అనివార్య కారణాల వల్ల ఆ వివాహం క్యాన్సిల్ అయ్యింది. ఇదిలా ఉంటే తాజాగా మళ్లీ త్రిష వివాహంపై వార్తలు వైరల్‌గా మారాయి. ఇటీవల శింబు మీడియాతో మాట్లాడుతూ.. ‘వచ్చే డిసెంబర్‌లో ఓ శుభవార్త చెబుతాను’ అంటూ ప్రకటించారు. దీంతో త్రిష-శింబు ప్రేమలో ఉన్నారని త్వరలోనే వీరిద్దరు వివాహం చేసుకోనున్నారని సోషల్ మీడియలో కొందరు పోస్ట్‌ లు పెడుతున్నారు. ఇదే విషయాన్ని శింబు తండ్రి రాజేందర్‌ను అడిగితే ఎలాంటి సమాధానం చెప్పుకుండా ఆ ప్రశ్నను దాటేశారు. దీంతో త్రిష, శింబుల పెళ్లిపై అనుమానాలు మరింత బలపడ్డాయి. మరి సోషల్‌ మీడియాలో వస్తోన్న ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే ఈ జంట స్పందిచాల్సిందే.

ఇదిలా ఉంటే ‘విన్నైతండి వరువాయ’ (తెలుగులో ఏమాయ చేశావే) చిత్రంలో ఈ జంట కలిసి నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో వీరి మధ్య ఉన్న కెమిస్ట్రీ చూసి వీరు ప్రేమలో ఉన్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. వివాహం కూడా చేసుకోనున్నారని పుకార్లు షికార్లు చేశాయి. అయితే తాము మంచి స్నేహితులమే అని ఈ జంట సమాధానమిచ్చింది. తాజాగా వీరిద్దరు కలిసి ‘కార్తీక్‌ డయల్‌ సేతా యెన్‌’ అనే షార్ట్‌ ఫిలిమ్‌లో నటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here