‘చెక్‌’ మళ్లీ మొదలైంది..!

నితిన్‌ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ‘చెక్’ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. భవ్య క్రియేషన్స్‌ బ్యానర్‌పై‌ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. థ్రిల్లింగ్‌ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్‌ అంచనాలు పెంచేసింది. లాక్‌డౌన్‌కు ముందు కొంతమేర షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది.

అయితే తాజాగా కేంద్ర ఇచ్చిన సడలింపుల మేరకు చిత్ర యూనిట్‌ సినిమా చిత్రీకరణను తిరిగి ప్రారంభించింది. ఈ విషయాన్ని హీరో నితిన్‌ స్వయంగా ట్విట్టర్‌ వేదికగా ప్రకటించాడు. జైలు సెల్‌లో నితిన్‌ను వెనకనుంచి తీసిన ఫొటోతో ఉన్న సినిమా పోస్టర్‌ను పోస్ట్‌ చేస్తూ.. కొత్త షెడ్యూల్‌ ప్రారంభమైంది అని క్యాప్షన్‌ రాసుకొచ్చాడు. ఇక హీరో నితిన్‌ ఈ సినిమాతో పాటు ‘రంగ్‌దే’లో నటిస్తోన్న విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here