క‌రోనాతో మంత్రి మృతి..

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. క‌రోనా కేసులు త‌గ్గుతున్న‌ప్ప‌టికీ ప్ర‌ముఖులు క‌రోనా బారిన ప‌డుతున్నారు. ప్ర‌జాప్ర‌తినిధులు క‌రోనా సోకి మృతి చెందుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. తాజాగా బీహార్‌లో పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి క‌పిల్ దేవ్‌ కామ‌త్ చ‌నిపోయారు.

కొద్ది రోజుల క్రితం క‌పిల్‌కు క‌రోనా సోకింది. దీంతో ఈయ‌న పాట్నాలోని ఎయిమ్స్ హాస్పిట‌ల్లో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయ‌న కోలుకుంటార‌ని అంతా అనుకున్నారు. కాగా శుక్ర‌వారం ఉద‌యం ఈయ‌న ఆరోగ్యం క్షీణించింది. దీంతో క‌పిల్ దేవ్‌ మృతి చెందారు. మంత్రి మృతిప‌ట్ల బీహార్ ముఖ్య‌మంత్రి నితీష్ కుమార్‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు దిగ్బ్రాంతి వ్య‌క్తం చేశారు. రాజ‌కీయాల్లో ఆయ‌న లేని లోటు తీర‌నిద‌న్నారు.

కాగా ఇటీవ‌లె బీహార్‌లో వెనుకబడిన, అత్యంత వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి వినోద్ కుమార్ సింగ్ చిన‌పోయారు. ఈయ‌న బీజేపికి చెందిన నేత‌. ఈయ‌న‌కు కూడా క‌రోనా సోక‌గా ఆ త‌ర్వాత కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో హాస్పిట‌ల్‌లో చేరారు. చిక‌త్స పొందుతూ చ‌నిపోయారు. బీహార్ ఎన్నిక‌ల వేళ నేత‌ల మృతి చెంద‌డం బాధాక‌రం. ఆ యా రాజ‌కీయ పార్టీల‌కు ఇది క‌ష్ట‌కాల‌మ‌నే స్థానికులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here