క‌నిపిస్తే కాల్చి వేయండి.. క‌రోనా క‌ట్ట‌డిలో కీల‌క ఆదేశాలు

క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు ప్ర‌పంచ దేశాలు చ‌ర్య‌లు క‌ఠినమైన చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. ఉత్త‌ర కొరియాలో క‌రోనా క‌ట్ట‌డి కోసం క‌నిపిస్తే కాల్చివేయాల‌న్న ఆదేశాలు ఇచ్చార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు ఉత్త‌ర కొరియాలో ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క కేసు కూడా న‌మోదు కాక‌పోవ‌డంతో మ‌రింత క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

ల‌క్ష‌ల్లో క‌రోనా కేసులు న‌మోద‌వుతున్న ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఒక్క క‌రోనా కేసు లేకుండా ఉత్త‌ర కొరియా రికార్డు సృష్టించింద‌ని చెప్పొచ్చు. అందుకే చైనా నుంచి ఒక్క కేసు కూడా దేశంలోకి ప్ర‌వేశించ‌కుండా ఉత్త‌ర కొరియా క‌ట్టుదిట్టంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇందుకోసం జ‌న‌వ‌రి నుంచే ఆ దేశ స‌రిహ‌ద్దుల‌ను మూసివేసింది. చైనా ఉత్త‌ర కొరియా స‌రిహ‌ద్దులో ఎవ‌రున్నా కాల్చివేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

ఉత్త‌ర కొరియాలో యూఎస్ బ‌ల‌గాల క‌మాండ‌ర్ రాబ‌ర్ట్ అబ్ర‌హాం  ఈ విష‌యాల‌ను వెల్ల‌డించారు. చైనా నుంచి ఎవ్వ‌రూ రాకుండా స‌రిహ‌ద్దులోప్ర‌త్యేక కార్య‌క‌లాపాల ద‌లాన్ని ఏర్పాటు చేశారు. ఈ ద‌ళం స‌రిహ‌ద్దులో అత్యంత క‌ట్టుదిట్టంగా ఉంటుంది. ఉత్త‌ర కొరియా స‌రిహ‌ద్దులో ఒక కిలోమీట‌రు మేర ఏ వ్య‌క్తి క‌నిపించినా కార‌ణాల‌తో సంబంధం లేకుండా చంపేస్తారు.

ఉత్త‌ర కొరియా ఈ విధంగా ఉన్నందుకే అక్క‌డ ఒక్క కేసు కూడా న‌మోదు కాలేదు. భార‌త్‌, అమెరికా లాంటి దేశాల్లో క‌రోనా నివార‌ణ‌కు ఎన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నా వైర‌స్ మాత్రం వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఎంతో మంది ప్ర‌జ‌ల ప్రాణాలు పిట్ట‌ల్లా రాలిపోతున్నాయి. మ‌రి నిజంగా ఉత్త‌ర కొరియా లాంటి క‌ఠిన‌మైన నిర్ణ‌యాలు తీసుకుంటేనే ఇలాంటి ప‌రిస్థితుల్లో ఎంత‌గానో ఉప‌యోగ‌పడుతుంద‌న్న భావ‌న ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here