ఒక్క రోజు కూడా డల్ గా అనిపించలేదు..

సాయిధరమ్ తేజ్.. ‘సోలో బతుకే సో బెటర్’ అనే  చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సుబ్బు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కరోనా కారణంగా కొన్ని రోజులు షూటింగ్ వాయిదా పడ్డ ఈ చిత్రం… కేంద్రం ఇచ్చిన సడలింపుల తర్వాత మళ్లీ షూటింగ్ ను ప్రారంభించింది. అయితే తాజాగా శుక్రవారంతో ఈ సినిమా షూటింగ్ పూర్తయింది.

ఈ విషయాన్ని సాయి ధరమ్ తేజ్ ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులతో దిగిన ఫోటోలు షేర్ చేస్తూ.. ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ‘సరదా సరదాగా సాగిన మా ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా షూటింగ్ పూర్తయింది. సెట్ మీద ఒక్క రోజు కూడా డల్ మూమెంట్ లేదు. మాస్క్ వేసుకుని షూటింగ్ చేసిన సందర్భాలైనా సరే.. మాస్క్ ధరించకుండా చేసిన సందర్భాలైనా సరే.. అంతా సరదాగా గడిచిపోయిదంటూ’ ట్వీట్ చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here